Saturday, 22 September 2012

అమృతత్వం

మంచి చెడులను వివేకంతో, సాధనతో మధిస్తే
ఆత్మ తత్వమైన  అమృతం సిద్ధిస్తుంది 

భారతీయ వేదాంతసారం ఈ జీవితంలోనే మనము జనన మరణాలకు అతీతమైన "అమృతత్వాన్ని" సాధించడానికి ప్రయత్నించడమే. దీని కోసమే హిందూధర్మము మనిషి యొక్క జీవిత కాలమును నాలుగు ఆశ్రమాలుగా విభజిస్తుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర అనే చతుర్వర్ణాల భేదము లేకుండా ఎవరైనను వీటిని -  చతుర్విధ పురుషార్థాలు - ధరార్థకామమోక్షాలు (ధర్మం, అర్థం, కామం, మోక్షం) ఆచరించి మన నిజ స్వరూపమైన సచ్చిదానంద స్థితిని ప్రత్యక్షానుభవం పొందాలని ఆశిస్తున్నది.
అజ్ఞ - మూడో కన్ను - అంతః చక్షువు - ధ్యాన స్థానం
బిందు కేంద్రం - అమృతత్వానికి ఒక మార్గం 
జగన్మాత 

మనం కేవలం ఈ శరీరం, మనసు మాత్రమే కాక పంచ కోశాలకు అతీతమైన అమృతత్వమైన "ఆత్మ" గా అనుభవం పొందడమే బ్రహ్మానందం , పరమానందంగా శ్రీ రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి శివానంద, పరమహంస యోగానంద, నిసర్గ దత్త మహారాజ్, వంటి మహనీయులు పేర్కొన్నారు. 
శ్రీ రమణ మహార్షి 
శ్రీ రామకృష్ణ పరమహంస 
పరమహంస యోగానంద 
వీరి ఆధ్యాత్మిక పుస్తకాలు రోజూ కాసేపైనా చదవండి - అమృతత్వం వైపు అడుగులు వేయండి, అది క్రమంగా నడకవుతుంది, సరైన సత్సాంగత్యం/ సత్సంగం, సాధన కలిసి వస్తే అది అంతః ప్రయాణ మవుతుంది, పుణ్య యాత్రలకంటే దివ్యమైన "అమర" యాత్ర అవుతుంది, అమ్మలగన్న అమ్మ దివ్య జగన్మాత అనుగ్రహిస్తే "అమృతత్వం" సిద్ధిస్తుంది.

అమృతత్వ అన్వేషణకు తోడ్పడే పుస్తకాలు, ఆచరణాత్మక సులువైన పద్ధతుల వివరాలతో మళ్ళీ కలుస్తాను.

ఆ దివ్య జగన్మాత మీపై మరింత కరుణ, దయ, ప్రేమ చూపి అనుగ్రహించాలని ఆశిస్తూ,
- ఈశ్వర్